• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘శ్రీశైలంలో కళారాధన ఆకర్షణ’

KRNL: ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం నిత్య కళారాధన వేదికపై ఖమ్మం అభినయ రుద్ర నాట్యాలయం సంప్రదాయ నృత్యంతో అలరించింది. ఈ కార్యక్రమాల్లో హరికథ, బుర్రకథ, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

March 23, 2026 / 10:20 AM IST

మాచవరం మిర్చి రైతులకు లాభాల పంట

PLD: మాచవరం మండలంలో మిర్చి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది ‘ఎర్ర బంగారం’ కాసుల వర్షం కురిపిస్తోంది. నిన్నటి వరకు రూ.15వేల లోపు ఉన్న క్వింటాల్ ధర ఒక్కసారిగా రూ. 20 వేల మార్కును దాటడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ. 2 లక్షల వరకు లాభాలు వస్తుండటంతో, కల్లాల్లో ఆరబోసిన పంటకు రైతులు కంటికి రెప్పలా కాపలా ఉంటున్నారు.

March 23, 2026 / 10:14 AM IST

చినుకు పడితే చింతే.. వాహనదారులకు ఇబ్బందులే..!

VZM: గుర్ల మండలం జమ్ముపేట ఆర్వోబీ కింద చిన్నపాటి వర్షానికే నీరు నిల్వ ఉంటోంది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే నీరు నిల్వ ఉండిపోయింది. మట్టి ఎక్కువగా చేరుతుండటంతో వాహనాలు జారిపడిపోయే ప్రమాదముందని భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

March 23, 2026 / 10:14 AM IST

ఎమ్మెల్యే దృష్టికి ప్రజా సమస్యలు

ELR: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో పలు గ్రామాలు చెందిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు.

March 23, 2026 / 10:13 AM IST

సూర్యనారాయణ స్వామి సేవలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్

SKLM: శ్రీకాకుళం మండలం అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆయన నామ గోత్రాలను చదివి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి జ్ఞాపకను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో కేఎన్‌వీడీవీ.ప్రసాద్ పాల్గొన్నారు.

March 23, 2026 / 10:10 AM IST

లంకెలపాలెంలో ఆహ్లాదకరమైన వాటర్ ఫ్రంట్ పార్క్

VSP: లంకెలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వాటర్ ఫ్రంట్ పార్క్’ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాలమైన నడక దారి (Walking Track), చిన్నారుల కోసం ఆటస్థలాలు, ఓపెన్ జిమ్, పచ్చని గార్డెన్‌తో ఈ పార్క్ రూపుదిద్దుకుంది. సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇది సరైన వేదికగా మారింది.

March 23, 2026 / 10:10 AM IST

బద్రి నారాయణకు గౌరవ డాక్టరేట్

NDL: అహోబిలం మాలోలా గెస్ట్ హౌస్ మేనేజర్ బద్రి నారాయణకు ఇంటర్నేషనల్ తమిళ్ కల్చరల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తాను నిర్వహించిన సాంస్కృతిక సేవలను గుర్తించి ఈ గౌరవం ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాన్ని కూడా వెల్లడించారు.

March 23, 2026 / 10:06 AM IST

జీడి రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి: MLA

PPM: జీడి తోటల పునరుద్ధరణతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం గుమ్మలక్ష్మీపురంలో జీడి రైతులకు కొమ్మల కత్తిరింపు సామగ్రిని ఉచితంగా అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. 5 సంవత్సరాలు దాటిన తోటల్లో కొమ్మలు కత్తిరిస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో జీడి రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

March 23, 2026 / 10:02 AM IST

డ్రైనేజీలో పూడికతీత పనుల పరిశీలన

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని HP పెట్రోల్ బంక్ ఏరియా నందు డ్రైనేజీ ఓవర్ ఫ్లో కావడంతో రోడ్డు మీదకు డ్రైనేజీ మురికినీరు వస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవికు వాహనాదారులు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ వెంటనే జేసీబీ సహాయంతో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పూడికను తీసి మురికినీరు సాఫీగా వెళ్లేలా తగు చర్యలు తీసుకున్నారు.

March 23, 2026 / 10:00 AM IST

టీడీపీ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నెల్లూరు పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే గౌరవం దక్కుతుందని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని ఆయన అన్నారు.

March 23, 2026 / 09:59 AM IST

ఉత్సాహంగా న్యాయవాదుల క్రీడా దినోత్సవం

విశాఖ జిల్లా కోర్టులో నిర్వహించిన న్యాయవాదుల క్రీడా దినోత్సవం ఉత్సాహంగా సాగింది. షటిల్ (డబుల్స్) పోటీల్లో లాయర్ చెన్నా ప్రమోధిని, ప్రవల్లిక జట్టు ప్రథమ బహుమతి సాధించింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవి చీమలపాటి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు హాజరయ్యారు.

March 23, 2026 / 09:58 AM IST

పైప్‌డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ సౌకర్యమంతమైనది

NTR: విజయవాడలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్‌ను కలెక్టర్ లక్ష్మీశా ఆదివారం సందర్శించారు. PNG వినియోగం సురక్షితమైనదిగా, సౌకర్యవంతమైనదని కలెక్టర్ అన్నారు. భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు పర్యావరణానికి అనుకూలమైన PNG వినియోగం వైపు మళ్లాలని సూచించారు. జిల్లాలో PNG కనెక్షన్ల విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

March 23, 2026 / 09:58 AM IST

కేంద్ర మంత్రి కుమారస్వామితో ఎమ్మెల్యే భేటీ

VSP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదివారం రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన పలు కీలక సమస్యలపై చర్చించారు. ప్రధానంగా విమల విద్యాలయం మూసివేత వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, విద్యార్థుల భవిష్యత్తును మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

March 23, 2026 / 09:47 AM IST

జిల్లాలో గజరాజుల సంచారం

PPM: జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు సంచరిస్తున్నాయి. ప్రస్తుతం ఓల్డ్ బట్టలభద్ర-ఓల్డ్ బిత్రపాడు గ్రామాల మధ్య ఏనుగుల గుంపు తిరుగుతోంది. అయితే, సమీప పంట పొలాలకు రైతులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. ఏ క్షణాన దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

March 23, 2026 / 09:46 AM IST

రోజు రోజుకి తగ్గుతున్న సోమశిల జలాశయం నీటి నిల్వ

NLR: సోమశిల రిజర్వాయర్లో సోమవారం నాటికి నీటి నిల్వ 61.909 టీఎంసీలుగా (322.513 అడుగులు] ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ప్రస్తుతం నిలిచిపోగా, కాలువలు, ఇతర అవసరాల కోసం 1,450 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వేసవి తీవ్రతతో రోజుకు 332 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోందని అధికారులు తెలిపారు.

March 23, 2026 / 09:46 AM IST