VSP: లంకెలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వాటర్ ఫ్రంట్ పార్క్’ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాలమైన నడక దారి (Walking Track), చిన్నారుల కోసం ఆటస్థలాలు, ఓపెన్ జిమ్, పచ్చని గార్డెన్తో ఈ పార్క్ రూపుదిద్దుకుంది. సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇది సరైన వేదికగా మారింది.