• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అగ్ని ప్రమాదం.. తీవ్ర ఆస్తి నష్టం..!

KRNL: ఓర్వకల్ గ్రామంలో ఉన్న ఓ బైక్ మెకానిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మెకానిక్ షాప్‌లో ఆకస్మికంగా మంటలు చేలరేగాయి. దీంతో 18 ద్విచక్ర వాహనాలు మంటలు అంటుకుని ఆహుతి అయినట్లు స్థానికులు తెలిపారు. దాదాపుగా రూ. 400,000 ఆస్తి నష్టం సంభవించినట్టు షాపు యజమాని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 06:17 PM IST

రైతు సంతోషమే ప్రభుత్వం లక్ష్యం: రామరాజు

W.G: రైతు ఆదాయాన్ని పెంచి, ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండటమే ప్రభుత్వ సంకల్పమని నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. ఆదివారం నరసాపురం మండలం మోడీ గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి అన్నదాత సుఖీభవ పథకంపై ప్రచారం నిర్వహించారు.

March 22, 2026 / 06:16 PM IST

రేపే ప్రజా సమస్యల పరిష్కార వేదిక..!

అన్నమయ్య: జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఈనెల 23న సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. అర్జీలు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, వివరాల కోసం 1,100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

March 22, 2026 / 06:06 PM IST

పారదర్శకంగా కానిస్టేబుళ్ల బదిలీలు

సత్యసాయి: జిల్లాలో 190 మంది కానిస్టేబుళ్ల బదిలీలను ఎస్పీ సతీష్ కుమార్ పారదర్శకంగా చేపట్టారు. సీనియార్టీ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఐదు సబ్ డివిజన్లలో సిబ్బందిని కేటాయించారు. ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని నిబంధనల ప్రకారం కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ప్రొజెక్టర్ ద్వారా ఖాళీల వివరాలను ప్రదర్శించి సిబ్బంది సమక్షంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

March 22, 2026 / 06:00 PM IST

తలసేమియాతో బాధపడుతున్న వారికి ఆర్ధిక సహాయం

SKLM: కోటబొమ్మాళి(M) తిలారులో ఇప్పిలి షణ్ముఖరావు గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. సంతబొమ్మాళి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రెయ్యమ్మతల్లి యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవాసొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు రూ. 15వేలు అందజేశారు. మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ చేతులు మీదుగా ఈ నగదును ఇప్పించారు. పేద కుటుంబం కావటంతో సహాయం చేసినట్లు తెలిపారు.

March 22, 2026 / 05:51 PM IST

బీజేపీలో చేరిన సీపీఐ నాయకుడు

అనంతపురం జిల్లా BJP అధ్యక్షుడు కొనకొండ రాజేష్‌ను జల్లిపల్లికి చెందిన వడ్డే రామాంజనేయులు కలిశారు. సీపీఐకి రాజీనామా చేసి వచ్చిన ఆయనకు రాజేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలన నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

March 22, 2026 / 05:50 PM IST

అదుపుతప్పి ట్రాన్స్ ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం

NLR: గూడూరు పరిధిలోని కొత్త కోడూరు బీచ్ రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ట్రాన్స్ ఫార్మర్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా దెబ్బతింది. దీంతో సమీప పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

March 22, 2026 / 05:50 PM IST

‘సేవాభావమే దేశ అభివృద్ధికి పునాది’

VSP: సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సేవలు అందిస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ పిలుపునిచ్చారు. ఆదివారం హోటల్ దసపల్లాలో ‘విశ్వగురు వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ‘విశ్వగురు’ పురస్కారాలను అందజేశారు.

March 22, 2026 / 05:49 PM IST

అగ్ని ప్రమాదంలో చికెన్ షాప్ దగ్ధం

AKP: మునగపాక(మం) తోటాడ సెంటర్‌లో గ్యాస్ సిలిండర్ లీకేజీతో చికెన్ షాప్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కనకదుర్గ చికెన్ సెంటర్‌లో మంటలు వ్యాపించి సుమారు 20 కోళ్లు, సామాగ్రి, విద్యుత్ మీటర్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

March 22, 2026 / 05:48 PM IST

కోడుమూరులో డాక్యుమెంట్ రైటర్ మృతి

KRNL: కోడుమూరు పట్టణంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న డాక్యుమెంట్ రైటర్ గంగాధర్ (39) ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల కోడుమూరు డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ సభ్యులు, మిత్రులు సంతాపం వ్యక్తం చేశారు. గంగాధర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేశారు. ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

March 22, 2026 / 05:39 PM IST

‘క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలి’

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల పరిధిలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఫలితాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉన్నత విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు.

March 22, 2026 / 05:30 PM IST

‘లంబసింగి వచ్చి వేసవి నుంచి ఉపశమనం పొందండి’

ASR: చింతపల్లి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన లంబసింగిలో వాతావరణం చల్లగా ఉందని ఏపీ టూరిజం పర్యాటక శాఖ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం వేసవి ఎండలతో ఆపసోపాలు పడుతున్నవారు లంబసింగి వచ్చి, సేదతీరి, ఉపశమనం పొందవచ్చాన్నారు. లంబసింగి ఏపీటీడీసీ రిసార్ట్స్‌లో సూట్ రూమ్స్, డీలక్స్ రూమ్స్, నాన్ ఏసీ కాటేజీలు మొత్తం 15 రూమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

March 22, 2026 / 05:29 PM IST

సహాయ స్ఫూర్తి ఫౌండేషన్‌కు సత్కారం

VZM: సహాయ స్ఫూర్తి సేవ సంస్థకి ఆదివారం మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో సత్కారం జరిగింది. సంఘం తొలి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సహాయ స్ఫూర్తి ద్వారా చేస్తున్న సేవలకు గాను లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి సాలువతో సత్కరించారు. అనంతరం మెమొంటో, ప్రశంస పత్రం అందజేసినట్లు ఫౌండేషన్ కార్యదర్శి రేవంత్ తెలిపారు.

March 22, 2026 / 05:28 PM IST

‘గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయండి’

SKLM: టెక్కలి ఐటెమ్ కాలేజీలో బీజేపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జరిగింది. ఆదివారం ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల్లో సైద్ధాంతిక స్పష్టత, సేవా భావం పెంపొందించడం ముఖ్యమని అన్నారు. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

March 22, 2026 / 05:27 PM IST

‘నీటి వనరుల రక్షణ కరువవుతుంది’

PPM: జిల్లా కేంద్రంలో నీటి వనరులకు రక్షణ కరువవుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఆ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దారినాయుడు పట్టణంలోని నెల్లిచెరువును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీటి వనరులైన చెరువులు, గెడ్డలకు రక్షణ కరువవుతోందన్నారు. మున్సిపాలిటీలోని పలు చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెప్పుకొచ్చారు.

March 22, 2026 / 05:27 PM IST