• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ పోస్తుండగా మంటలు

ATP: గుమ్మఘట్ట మండలం గోనబావిలో పెట్రోల్ మంటలు అంటుకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక హోటల్ యజమాని శ్రీనివాసులు, భార్య, కుమార్తె ఆదివారం ఒక సీసా నుంచి మరో సీసాలోకి పెట్రోల్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమీపంలో వెలుగుతున్న గ్యాస్ స్టవ్ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

March 22, 2026 / 05:00 PM IST

‘గరికపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి’

E.G: పిల్లల పౌష్టికాహారంపై చేసిన వ్యాఖ్యలపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని గోదావరి బాలోత్సవం సెక్రటరీ టి. తులసి డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, పౌష్టికాహార లోపంపై అవగాహన లేకపోవడమేనా లేక తెలిసి వ్యాఖ్యానించారా అని ప్రశ్నించారు. గుడ్డు కోసం పిల్లలు బడికి వస్తారనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు.

March 22, 2026 / 05:00 PM IST

కావూరులో రుద్రకోటేశ్వర స్వామి దర్శించిన ఎంపీ

PLD: చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో ఇటీవల ప్రతిష్టించిన శ్రీ రుద్రాణి సమేత శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, శివాలయ పరివార దేవతా మూర్తులను కూడా దర్శించుకుని ఆశీర్వాదాలు స్వీకరించారు.

March 22, 2026 / 05:00 PM IST

విజయనగరంలో మెగా రక్తదానం శిబిరం

VZM: మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం, మహేంద్ర హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరంలో ఆదివారం మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది యువకులు స్వచంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

March 22, 2026 / 04:58 PM IST

ఈనెల 25న అమరాపురంలో వారపు సంతకు వేలం పాట

సత్యసాయి: అమరాపురం మండలంలోని వారపుసంత, బస్టాండ్‌, దినసరి సంతలకు ఈనెల 25న వేలంపాట నిర్వహిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి యోగానంద్‌ తెలిపారు. ఈనెల 25న ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దినసరి సంతకు రూ. 20 వేలు, వారపు సంతకు రూ.20 వేలు డిపాజిట్‌ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు.

March 22, 2026 / 04:50 PM IST

మురుగు కాల్వలు ఉన్నా ప్రయోజనం లేదు..!

KDP: మైదుకూరు పట్టణంలోని 8వ వార్డులో డ్రైనేజీ ఉన్నా ఉపయోగం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. మురుగునీరు కాలువల ద్వారా ముందుకు పోవడం లేదన్నారు. దుర్వాసనతో పాటు దోమలు విపరీతంగా పెరిగాయని తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. మురుగు రోడ్డు పైకి వచ్చి చేరడంతో రాకపోకలకు అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

March 22, 2026 / 04:42 PM IST

కార్మిక చట్టాలు అమలు చేయాలి: గుత్తి త్యాగరాజు

TPT: లేబర్ కోడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని వరదయ్యపాలెం డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానంపై వస్తున్న ప్రచారాలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, అధిక పని గంటలు చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. కార్మిక హక్కులను కాపాడాలని, ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 22, 2026 / 04:38 PM IST

‘పీఎసీఎస్ అవకతవకలపై విచారణ చేపట్టాలి’

శ్రీకాకుళం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఈ సమావేశంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పీఎసీఎస్‌లలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు.

March 22, 2026 / 04:32 PM IST

చుక్కలూరులో విశేష అలంకరణలో గంగమ్మ తల్లి

ATP: తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, పట్టువస్త్రాలతో అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

March 22, 2026 / 04:32 PM IST

కొలిమిగుండ్లలో CITU నాయకులు నిరసన..!

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఇవాళ సీఐటీయు నాయకులు నరసింగరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సిమెంటు పరిశ్రమలలో భూములు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు. పరిశ్రమలలో భూ బాధితులకు ఉద్యోగాలు కల్పించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.

March 22, 2026 / 04:31 PM IST

రౌడీ షీటర్లకుసీఐ కౌన్సిలింగ్

NTR: ఇబ్రహీంపట్నంలో రౌడీ షీటర్లకు సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరిక జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కౌన్సిలింగ్‌లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని తెలిపారు. మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

March 22, 2026 / 04:31 PM IST

పిడుగుపాటుకు గురై పాడి రైతు మృతి!

PLD: అమరావతి(M) ఎండ్రాయిలో పిడుగుపాటుకు ఓ పాడి రైతు బలయ్యాడు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శనివారం సాయంత్రం గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. గట్టుపై పిడుగు పడి విజయ్ మృతి చెంది ఉండటం గమనించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 22, 2026 / 04:30 PM IST

వడ్డాదిలో స్కౌట్స్ గైడ్స్ శిక్షణ

AKP: వడ్డాదిలో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒరియెంటేషన్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీజేఏసీ కన్వీనర్ వీవీ రామరాజు ఆధ్వర్యంలో స్వామి నాయుడు శిక్షణ అందించారు. క్రమశిక్షణ, నాయకత్వం, సేవాభావం, సామాజిక సేవ, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇతరులకు సహాయం చేసే విధానాలు కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు రాంబాబు, వరప్రసాద్ పాల్గొన్నారు.

March 22, 2026 / 04:25 PM IST

రేపు రేషన్ కార్డుదారులకు కిరోసిన్..!

W.G: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

March 22, 2026 / 04:24 PM IST

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: పోలాకి(మం), రేవు అంపలాం గ్రామంలో యోగి బ్రదర్స్ వారి ఇంట జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పండగలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

March 22, 2026 / 04:24 PM IST