జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.
ఎండలకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వీడటం లేదు.. మరి విద్యార్థుల గురించి ఆలోచించరా అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. జూన్ 12వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు.
ఆదిపురుష్(Adipurush) మూవీపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి(tirupati)లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమా దర్శకుడు, హీరోయిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటివల ఆలయం ముందు డైరెక్టర్, హీరోయిన్ హగ్స్, ముద్దులు ఇచ్చుకోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి చర్చించామని చెబుతున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారా అనే ప్రశ్న వస్తోంది.
రెండు కాన్పులో అమ్మాయిల(girl child)ను వద్దనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రెండో ప్రసవంలో పాపాయి జన్మిస్తే రూ.6 వేల సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. మిషన్ శక్తి స్కీమ్ లో భాగంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని (CM Jagan)అంబటి రాయుడు కలిశారు
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా సీబీఐ చేర్చింది.
టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు బెయిల్ లభించింది.
చంద్రబాబు నాయుడు గొప్ప నేత అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఆ కామెంట్స్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీసింది.
ఇంచార్జీలు కలిసి రావడం లేదా..? అని మీడియా ప్రతినిధి విజయవాడి ఎంపీ కేశినేని నానిని ప్రశ్నించగా భగ్గుమన్నారు. ఇంచార్జీ అనేది రాజ్యాంగ బద్ద పదవీ కాదన్నారు. సామంత రాజు, రాజులు , రారాజులు ఎవరూ ఇక్కడ లేరన్నారు. ఇంచార్జీలు ఎవరు గొట్టంగాళ్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.21.18 కోట్ల వ్యయంతో 516 ఆటోలను కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు ఆటోలను అందజేయనుంది.
వచ్చే తొమ్మిది నెలల పాటు కష్టపడి పని చేసి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించినట్లు సమాచారం. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నారా లోకేష్ పాదయాత్రలో కోడిగుడ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు సెల్పీ ఇవ్వనందుకే కోడిగుడ్ల దాడి చేసినట్లు నిందితులు తెలిపారు.
పసిపిల్ల వాడిని ఎత్తుకొని లేడీ వీఆర్వో మట్టి మాఫియా అడ్డుకుంది
ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ నిర్మాతలకు ఓ రిక్వెస్ట్ చేశారు. మూవీ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటు ఖాళీగా ఉంచాలని అడిగారు.