SKLM: పోలాకి(మం), రేవు అంపలాం గ్రామంలో యోగి బ్రదర్స్ వారి ఇంట జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పండగలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
KRNL: జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, ప్రజలు ఇండక్షన్ స్టవ్, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి LPG గ్యాస్ అంశంపై డివిజన్, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సూచనలు చేశారు.
NLR: తమిళనాడుకు చెందిన బోట్లను ఆంధ్రా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే టీడీపీ నేతలు వాటిని దొంగచాటుగా వదిలేశారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. స్వార్ధ రాజకీయాల కోసం టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు ఈ పని చేశారని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం మీద టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు.
KKD: రాష్ట్ర యువత ఉజ్వల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. ఆదివారం కాకినాడ రూరల్ 48, 49 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
KDP: ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని AP SC కమిషన్ సభ్యులు వెంకటప్ప అన్నారు. ఆదివారం UTF కార్యాలయంలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గంలో STలకు చెందిన అసైన్ భూములు కబ్జాకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అడవుల నుంచి వెదురు తెచ్చుకున్నప్పుడు అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు.
అన్నమయ్య: మొలకలచెరువు(M) గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబం నిలదీయగా, నిందితుడి బంధువులు దాడి చేసి బెదిరించినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనతో బాలిక తల్లి భవాని గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
KRNL: ఆదోని నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు 30 మందికి రూ.12.63 లక్షల చెక్కులు అందజేశారు. గత 18 నెలల్లో 519 మందికి రూ.1.85 కోట్లు సహాయం అందినట్లు తెలిపారు. మరిన్ని అర్హులకు సహాయం కొనసాగుతుందని సీనియర్ నాయకులు పేర్కొన్నారు.
TPT: ఎర్పేడు మండలం వికృతమాల గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తగా, దీనిని తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి రాయల్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి గంటలోపే నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు తెలుగు గంగ పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు.
సత్యసాయి: కనగానపల్లి మండలంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కనగానపల్లి హెడ్ క్వార్టర్ వద్ద రూ.80 లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న శ్రీ భక్త కనకదాస కళ్యాణ మండప నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ పోతులయ్య, డీఈ లక్ష్మీనారాయణ, కనగానపల్లి ఎంపీటీసీ భాస్కర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
GNTR: తెనాలి సోనోవిజన్‌లో ఈ నెల 15న జరిగిన భారీ చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముత్యంశెట్టిపాలెం, చినరావూరులకు చెందిన మైనర్లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు.
CTR: వెదురుకుప్ప మండలం పాతగుంట పంచాయతీలో జల్లికట్టు కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు మోహన్ మురళి, సర్పంచ్ భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా యువత ఉపాధ్యక్షులు చంద్రబాబు రెడ్డి తదితరులు పాల్గొని వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
NTR: సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు తమ రెవెన్యూ అర్జీలను ఈ క్లినిక్‌లలో అందజేయాలని సూచించారు.
ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడుకి ఎవరూ లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న ఆ నలుగురు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల వెంకటేష్ అ అనాధ వృద్ధుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణ ప్రజలు ఆ నలుగురు సేవా సమితి సభ్యులను అభినందించారు.
VZM: బొబ్బిలి(మం) శివడవలస మాజీ సర్పంచ్ చప్ప రామస్వామినాయుడు, ఆయన సతీమణి అనారోగ్యం బారిన పడడంతో ఎమ్మెల్యే బేబినాయన వారిని ఆదివారం పరామర్శించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమకు అండగా ఉండే రామస్వామినాయుడు, సతీమణి అనారోగ్యానికి గురికావడం బాధ కలిగించినట్లు చెప్పారు.
SKLM: ఈ నెల 23న భగత్ సింగ్, రాజగురు సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతి కార్యక్రమం జయప్రదం చేయాలని బొడ్డపాడు యువజనసంఘం సభ్యులు అన్నారు. ఆదివారం దీనికి సంబంధించిన కరపత్రాలను పలాస(మం) బొడ్డపాడు అమర వీరులు స్మారక మందిరం వద్ద ఆవిష్కరించారు. అలాగే ఆ సంఘం 73వ వార్షికోత్సవం జరుగుతుందన్నారు.