కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు గొల్లవెల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు ఉప్పలగుప్తంలో ఆత్మ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు భీమనపల్లి గ్రామంలో ఆర్అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ప్రకాశం: ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంగళవారం రిజిస్ట్రార్‌పై పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి కార్యాలయంలో వీరంగం సృష్టించాడు. తనపై ఉన్న జీపీఏను రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై ఉన్న జీపీఏను తనకు తెలియకుండా ఎలా రద్దు చేస్తారంటూ దూషణలకు దిగినట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే జీపీఏను రద్దు చేసినట్లు రిజిస్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు
కృష్ణా: రాష్ట్రంలో రూ. 44 కోట్లతో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. 2 నెలల్లోగా ఈ కేంద్రాలను ప్రారంభించడానికి కార్యచరణ చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వీటి ఏర్పాటుతో పేదలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ప్రొద్దుటూరుకు చెందిన చంద్ర ఓబులరెడ్డి వృషభాలు ప్రథమ స్థానం సాధించి యూనికార్న్ బైక్ గెలుచుకున్నాయి. గన్నవరం ఎడ్లు రూ.లక్ష, సూర్యాపేట ఎడ్లు రూ.80 వేలు, పెద్దకొట్టాల ఎడ్లు రూ.60 వేల బహుమతులు పొందాయి. విజేతలకు ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి మంగళవారం బహుమతులు అందజేశారు.
E.G: APలోని పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లులను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని MP పురంధేశ్వరి కోరారు. దేశంలోనే పామాయిల్ సాగు APలో అధికమని పేర్కొన్నారు. ప్రభుత్వ, సహకార మిల్లుల్లో పాత పద్ధతుల వల్ల నూనె దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని వివరించారు. మిల్లులను ఆధునీకరించడం ద్వారా దిగుబడి పెరిగి రైతులకు లాభదాయకమైన ధర లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
PLD: అమరావతిలో అకాల వర్షానికి తడిచిన మిర్చి పంటను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు రాజశేఖర్ యాదవ్, చిలకా నాగలక్ష్మితో పాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరులో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అయ్యప్ప గుడి సమీపంలోని ఓ మెడికల్ షాప్ పక్కన యువకుడి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించి వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలానికి వెళ్లారు. అదే సమయంలో మృతుడి జేబులోని సెల్ ఫోన్ మోగింది. వీఆర్వ్ కాల్ మాట్లాడగా.. ఆ ఫోన్ తన తమ్ముడు కమలాకర్ (37)ది అని తమది నంద్యాల అని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. చాబోలు హైవేపై మార్నింగ్ స్టార్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పోలీసులు చేరుకుని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను సురక్షితంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌కు చేర్చారు.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగనుంది. జనాభా ప్రాతిపదికన వార్డులను విభజించి కొత్త వార్డులను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలమంచిలి మున్సిపాలిటీలో 46,732 జనాభా ఉండగా ప్రస్తుతం 56,000 జనాభా ఉంది. దీంతో 25 వార్డుల సంఖ్య 36కు పెరిగే అవకాశం ఉంది.
VSP: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వార్డుల సంఖ్య సవరణకు సిద్ధమైంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్‌లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా నిర్ణయించింది. ప్రస్తుతం 98 వార్డులు ఉన్న జీవీఎంసీలో జనాభా 24 లక్షలు దాటడంతో వార్డులు పెరిగే అవకాశం ఉంది.
SS: కదిరి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన నిరాహార దీక్షకు ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ డివిజన్ నాయకులు బాషా, ఓబులేసు కూడా మద్దతు ప్రకటించారు. యూటీఎఫ్ ఉద్యమాలకు మరింత శక్తినిచ్చేలా వారు సమావేశంలో ప్రసంగించారు.
ATP: జాబ్ క్యాలెండర్ పేరిట చంద్రబాబు సర్కారు యువతను మోసం చేస్తోందని వైసీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్ అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 1.72 లక్షల కొలువులు ఖాళీగా ఉంటే కేవలం 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్‌లను విడుదల చేశామన్నారు.
W.G: జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 81216 76653 కాల్ సెంటర్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.
ELR: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు ఒక్క క్లిక్‌తో పోలీసుల సాయం అందుతుందని ఏలూరు త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏలూరు బాలికల వసతి గృహంలో ‘శక్తి యాప్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో ‘SOS’ బటన్ క్లిక్ చేసి పోలీసుల తోడ్పాటు పొందాలని సూచించారు.
NLR: వింజమూరులో ఏప్రిల్ 1న జరిగే “రైతన్న మీసేవలో” కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను మంగళవారం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిపాడ్, వేదిక, పార్కింగ్ వంటి సౌకర్యాలను తనిఖీ చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.