PPM: కోర్టుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా SP మాధవరెడ్డి అన్నారు. ఆదివారం ఎస్.కోటలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కూడా పాల్గొన్నారు.
NDL: శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులు వరుసలో రావడంలేదని ప్రశ్నించిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ చాంద్ భాషాను బలవంతంగా బస్సులో ఎక్కించి దోర్నాల వరకు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఇవాళ కేసు నమోదు చేసి, డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో టమోటా, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలివీడు మండలంలో నష్టపోయిన తోటలను సీపీఐ నాయకులు పరిశీలించి, రైతులకు వెంటనే పరిహారం, పంట బీమా చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
SKLM: ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జడ్పీ ఛైర్‌పర్సన్ విజయ అన్నారు. ఆదివారం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం ఉండరాదు అని పేర్కొన్నారు.
విశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఘన సన్మానం జరిగింది. పోర్ట్ యాదవ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదివారం శివాజీపాలెం సవేరా ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఉద్యోగ జీవితం ఒత్తిడిగా ఉంటుందని, ఇకపై కుటుంబంతో ఆనందంగా గడపాలని ఆయన అన్నారు.
KRNL: పార్టీకి బలం, బలగం సోషల్ మీడియా సైనికులేనని ఎమ్మెల్యే విరుపాక్షి, తనయుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇవాళ చిప్పగిరిలో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం సోషల్ మీడియా సైనికుల బాధ్యత అని అన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
KDP: పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.
సత్యసాయి: లేపాక్షిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ అర్చకుడు ఎంవి శ్రీనివాస్ కుమార్ ఉగాది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ తరపున ఈవో ఎంహెచ్ నరసింహమూర్తి, కేంద్ర ప్రభుత్వ శాఖ ఎంఎటీఎస్ రాము, టూరిజం గైడ్స్, ఆలయ సిబ్బంది ఆయనను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, అధికారులు పాల్గొన్నారు.
E.G: రాజమండ్రి 45వ డివిజన్ ఎస్‌ఎస్‌ఆర్ లేఅవుట్ శివాలయం ప్రాంతంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రకాశం: పొన్నలూరు గ్రామ నడిగడ్డ దగ్గర పేకాట ఆడుతున్న ఆరు మంది వ్యక్తులను ఎస్ఐ సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5,280 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
BPT: సంతమాగులూరు మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేవూరి వాసిరెడ్డి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇకపై కూడా రవికుమార్ నాయకత్వాన్ని మరింత బలపరచాలని, కూటమిని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని నాయకులు సంకల్పించారు.
SKLM: పోలాకి(M) దీర్ఘాసి భవాని కాలనీలో దుర్గాగిరి అమ్మవారి 11వ జాతర మహోత్సవం ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరరావు ఉన్నారు.
TPT: తిరుమల తిరుపతి దేవస్థానాలుకు చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ రూ. కోటి విరాళం అందించింది. ఈ విరాళాన్ని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి అందించారు. దాత జే. రాజా రమేష్, టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
ASR: ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఆదివారం జరిగిన బస్తర్ హెరిటేజ్ మారథాన్ పోటీలలో అల్లూరి జిల్లా అరకులోయ మండలానికి చెందిన నలుగురు పిల్లలు పాల్గొన్నారు. 42km మారథాన్‌లో కిల్లో బుద్దు, 21kmలో కొర్రా గోపి, 5kmలో బురిడి జానిబాబులు పాల్గొని టాప్ 20లో నిలిచారు. అలాగే 5km సబ్ జూనియర్ మారథాన్‌లో పాల్గొన్న కిల్లో వినాయక్(8) టాప్ 5లో నిలిచాడు.
ATP: తాడిపత్రిలో ఓ వ్యక్తి మటన్ ఉడకలేదని వంట పాత్రతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఉగాది సందర్భంగా కొన్న మాంసాన్ని ఎన్నిసార్లు ఉడికించినా ఉడకకపోవడంతో సదరు విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు చేరుకున్నాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన పోలీసులు ఆ వ్యక్తికి సర్దిచెప్పి పంపించారు. ఈ వింత ఘటన స్థానికంగా నవ్వులు పూయించింది.