• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘CMRF పేదల భరోసా ఇస్తుంది’

ELR: పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే సీఎంఆర్ఎఫ్ చెక్కులు చేయూత అందిస్తున్నాయని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో MLA లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చింతలపూడి, లింగపాలెం మండలాలకు చెందిన ఐదుగురికి రూ. 2,45,091 లక్షల విలువగల చెక్కులను అందజేశారు.

March 22, 2026 / 05:26 PM IST

రేపటి మంత్రి పర్యటన వివరాలు..!

అన్నమయ్య: రాయచోటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అయితే ఉదయం 08:30 గంటలకు చిన్నమండెంలో భూమి పూజ, 10:00 గంటలకి రాయచోటిలో విగ్రహ ప్రతిష్ఠ, 12:00 గంటలకు బి.కొత్తకోటలో కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

March 22, 2026 / 05:25 PM IST

రొయ్య రైతులకు యుద్ధ సెగ.. భారీగా తగ్గిన ధరలు

KKD: అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల కారణంగా స్థానిక ఆక్వా రంగం తీవ్రంగా ప్రభావితమైంది. రొయ్యల ఎగుమతులు దాదాపు నిలిచిపోవడంతో.. గతంలో కిలో రూ.500 వరకు ఉన్న రొయ్యల ధరలు రూ. 150కి పడిపోయాయి. కాకినాడ జిల్లాలోని రొయ్యల రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో తక్షణ సహాయం అందించి తమని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

March 22, 2026 / 05:22 PM IST

చీనీ మార్కెట్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన చైర్ పర్సన్

అనంతపురం చీనీ మార్కెట్‌ను మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెలవు రోజున అధికారులకు అనుమతి లేకపోయినా, మార్కెట్‌కు చీనీ లోడ్లు ఎలా వచ్చాయని సిబ్బందిని ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లోడ్‌లు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 22, 2026 / 05:20 PM IST

వాసవీ కన్యకా పరమేశ్వరి సేవలో రామనాధ్ రెడ్డి

W.G: జిల్లా పంచాయతీ అధికారి N. రామనాధ్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా పెనుగొండలోని నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ కట్టా సత్తిబాబు వారికి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వాసవీధామ్‌లో జరిగిన పూజల్లో ట్రస్ట్ సభ్యులు కోట్ల రాజా, కోట్ల కృష్ణారావు అమ్మవారి ఫోటోను బహుకరించారు.

March 22, 2026 / 05:18 PM IST

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు..!

NDL: చాగలమర్రి మం.నీలంపాడు రాంపల్లి గ్రామాల మధ్య ఆదివారం ద్విచక్రవాహనం – ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జంగాలపల్లికు చెందిన మహబూబ్ బాషా ద్విచక్ర వాహనంపై చాగలమర్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు క్షతగాత్రుడిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

March 22, 2026 / 05:17 PM IST

జిల్లా అధ్యక్షురాలు దృష్టికి ప్రజా సమస్యలు..!

KRNL: నగరంలోని పద్మశాలి నగర్ కాలనీ ప్రజలు తమ సమస్యలను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మకు ఆదివారం వివరించారు. టీడీపీ కార్యాలయంలో ఆమెను కలిసి సమస్యల పరిష్కారం కోరారు. సమస్యలను విన్న ఆది కృష్ణమ్మ, అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.

March 22, 2026 / 05:15 PM IST

దౌలతాపురంలో న్యాయ విజ్ఞాన సదస్సు

కడప: చెన్నూరు మండలం దౌలతాపురంలో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు యామిని, సెక్రటరీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ విభాగ ఆధ్వర్యంలో నీటి దినోత్సవం ప్రాముఖ్యత, న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.

March 22, 2026 / 05:11 PM IST

‘ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి’

SKLM: రానున్న పలాస మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పలాస టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు క్లస్టర్, యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.

March 22, 2026 / 05:05 PM IST

శాఖ గ్రంధాలయంలో ‘చదవడం మాకిష్టం’

AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో చదవడం నాకు ఇష్టం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రంధాలయాధికారి దమయంతి విద్యార్థులకు కథలు చదివించి, కెరీర్ మార్గదర్శక సూచనలు అందించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పీ. ప్రభాకర్ ప్రపంచ జల దినోత్సవ ప్రాముఖ్యత వివరించి, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. పజిల్, వినోదాత్మక ఆటలతో కార్యక్రమం ముగిసింది.

March 22, 2026 / 05:01 PM IST

హైవేపై ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకటరావుపల్లి సమీపంలో ఆదివారం ప్రమాదం జరిగింది. మర్రిపాడు నుంచి నెల్లూరుకు బైకుపై యువకుడు వెళ్తుండగా పొగాకు ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 05:00 PM IST

కొండపిలో వీధికుక్కల బెడద

ప్రకాశం: కొండపిలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. బైకులపై ప్రయాణించే వారిని వెంటాడుతున్నాయి. దీంతో ఆ కంగారులో బైకుల పైనుంచి యువకుల కింద పడి గాయాల పాలైన సంఘటనలు గతంలో ఉన్నాయి. చిన్నారులు వీధి గుమ్మాల ముందు ఆడుకునే క్రమంలో పిల్లలపై దాడి చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి. వీధి కుక్కలను పంచాయతీ అధికారులు నివారించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.

March 22, 2026 / 05:00 PM IST

పెట్రోల్ పోస్తుండగా మంటలు

ATP: గుమ్మఘట్ట మండలం గోనబావిలో పెట్రోల్ మంటలు అంటుకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక హోటల్ యజమాని శ్రీనివాసులు, భార్య, కుమార్తె ఆదివారం ఒక సీసా నుంచి మరో సీసాలోకి పెట్రోల్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమీపంలో వెలుగుతున్న గ్యాస్ స్టవ్ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

March 22, 2026 / 05:00 PM IST

‘గరికపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి’

E.G: పిల్లల పౌష్టికాహారంపై చేసిన వ్యాఖ్యలపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని గోదావరి బాలోత్సవం సెక్రటరీ టి. తులసి డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, పౌష్టికాహార లోపంపై అవగాహన లేకపోవడమేనా లేక తెలిసి వ్యాఖ్యానించారా అని ప్రశ్నించారు. గుడ్డు కోసం పిల్లలు బడికి వస్తారనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు.

March 22, 2026 / 05:00 PM IST

కావూరులో రుద్రకోటేశ్వర స్వామి దర్శించిన ఎంపీ

PLD: చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో ఇటీవల ప్రతిష్టించిన శ్రీ రుద్రాణి సమేత శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆదివారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, శివాలయ పరివార దేవతా మూర్తులను కూడా దర్శించుకుని ఆశీర్వాదాలు స్వీకరించారు.

March 22, 2026 / 05:00 PM IST