ప్రకాశం: కొండపిలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. బైకులపై ప్రయాణించే వారిని వెంటాడుతున్నాయి. దీంతో ఆ కంగారులో బైకుల పైనుంచి యువకుల కింద పడి గాయాల పాలైన సంఘటనలు గతంలో ఉన్నాయి. చిన్నారులు వీధి గుమ్మాల ముందు ఆడుకునే క్రమంలో పిల్లలపై దాడి చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి. వీధి కుక్కలను పంచాయతీ అధికారులు నివారించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.