ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్.. కొట్టుకుంటునే ఉన్నారు. ఈ సినిమా హాలీవుడ్లో దుమ్ములేపుతున్న కూడా గొడవ పడుతున్నారు. ఈసారి ఏకంగా అవతార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ పట్టుకొని లొల్లి చేస్తున్నారు. అసలు ఈ సారి ఫ్యాన్స్ వార్ చూస్తే.. ఇదేం రచ్చ రా బాబు అనక తప్పదు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన ‘ఆర్ఆర్ఆర్’కు.. జేమ్స్ కేమరాన్ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు సార్లు ఆ సినిమాను చూశాడు. అందుకే రాజమౌళి ఎదురుపడగానే ప్రశంసల వర్షం కురిపించాడు జేమ్స్ కామెరాన్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తనకు నచ్చిన కొన్ని సన్నివేశాల గురించి ఎగ్జైటింగ్‌గా చెప్పుకొచ్చాడు. అలాగే దర్శక ధీరుడి పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఎక్కడ కూడా హీరోల పేర్లను ప్రస్తావించలేదు. కానీ చరణ్, తారక్ ఫ్యాన్స్ మాత్రం జేమ్స్ కామెరూన్ చెప్పింది.. మా హీరో గురించి అంటే, మా హీరో గురించి.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకుంటున్నారు.
కామెరాన్ భూమ్ అంటూ.. హెవీ స్కోర్‌తో ఓ సీన్‌ని ఎలివేట్ చేయడం చాలా బాగా నచ్చిందని.. కీరవాణితో చెప్పుకొచ్చాడు. అది ఎన్టీఆర్ కొమరం భీమ్ సీన్ గురించేనని అంటున్నారు తారక్ ఫ్యాన్స్. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. లేదు లేదు.. చరణ్ అల్లురి సీన్ గురించే చెప్పాడని మెగా ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అంతేకాదు.. జేమ్స్ మాట్లాడిన వీడియోలో ‘రామ్’ అనే సబ్ టైటిల్‌ను తొలగించారని అంటున్నారు. ఇలా చరణ్, తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయినా.. మనోళ్లు ఆస్కార్ రేంజ్లో రచ్చ చేస్తుంటే.. ఇదేం సిల్లీ లొల్లి అంటూ.. మిగతా హీరోల ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.