»Nadendla Manohar Demand Ap Cm Jagan Mohan Reddy Apologize To Pawan Kalyan
Nadendla Manohar: జగన్ పవన్ కు క్షమాపణ చెప్పాలి
ఇటివల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) పెళ్లిళ్ల గురించి మళ్లీ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పందించారు. సీఎం ఎప్పుడు చుసినా పవన్ వ్యక్తిగత విషయాలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలా దిగజారి మాట్లాడుతున్న సీఎంకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
Nadendla Manohar demand ap cm jagan mohan reddy apologize to Pawan Kalyan
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక కార్యక్రమాల్లో ప్రతి సారీ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యక్తిగత అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. పవన్ పెళ్లిళ్లు, ఆయన సినిమాల గురించి మీకు ఎందుకని ప్రశ్నించారు. ఆయన సినిమాలు చేసి డబ్బులు సంపాదించి వాటిని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. అంతేకాదు పవన్ కల్యాణ్ మీ లాగా అవినీతి చేస్తే ఇలా ఉండరని అన్నారు. ఈ అంశాన్ని ఏపీ వ్యాప్తంగా జనసేన వీర మహిళలు ఖండించాలని పేర్కొన్నారు. జగన్ సీఎం స్థాయిలో ఉండి ఇంత దిగజారి మాట్లాడటమెంటనీ గుర్తు చేశారు.
సీఎం జగన్ ఎప్పుడూ చూసినా పవన్ కల్యాణ్ వ్యక్తిగతం గురించి మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇక ముఖ్యమంత్రి జగన్(jagan) ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏపీలో పరిపాలన చేతకాక జగన్ ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం ఒక్క టోఫెల్ విషయంలోనే నాలుగేళ్లలో 4 వేల కోట్ల రూపాయలు ఒక సంస్థకు వెచ్చించారని మనోహర్ పేర్కొన్నారు. అది ఎంత మందికి ఉపయోగపడుతుందో చెప్పాలన్నారు. ఈ రకంగా ఎన్నో విషయాల్లో అక్రమాలు చేసి ప్రజా సొమ్మును జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఇన్నేళ్ల పాలనలో సీఎం జగన్ ఎక్కడ అభివృద్ధి(development) చేశారో చూపించాలని నిలదీశారు. అంతేకాదు సీఎం జగన్ పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.