»Mps Who Have The Most Assets In Telugu States Where Are All These Crores
MP Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులు ఉన్న ఎంపీలు..ఇన్ని కోట్లు ఎక్కడివి.?
దేశంలోని మొత్తం ఎంపీల ఆస్తులను బయటపెట్టింది ఎడీఆర్ సంస్థ. దీనిలో భాగంగా అందరికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఎంపీలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం బీజేపీ 85 మంది ఎంపీల ఆస్తుల కన్న వీరి ఆస్తి రెండింతలు ఉంది.
The assets of BRS and YCP MPs are double that of all MPs in the country. Bandi Parthasarathi Reddy, Alla Ayodhyarami Reddy
MP Assets: పార్లమెంట్ మెంబర్లు(Members of Parliament)లో మన తెలుగు రాష్ట్రాల ఎంపీలే ఆస్తుల పరంగా టాప్ పోజిషన్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ(YSRCP), బీఆర్ఎస్(BRS) పార్టీలకు చెందిన ఎంపీలు(MP) అత్యధిక ఆస్తుల విలవతో పోల్చుకుంటే జాతీయ పార్టీల సభ్యల కంటే ఎక్కువ సంపాదన కలిగి ఉన్నారు. మొత్తం దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారు బీఆర్ఎస్ ఎంపీ(BRS MP) బండి పార్థసారథిరెడ్డి (Bandi Parthasaradhi Reddy) ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, వైఎస్ఆర్సీపీ ఎంపీ(YSRCP MP) ఆళ్ల అయోధ్యరామిరెడ్డి(Alla Ayodhya Ramireddy)లు సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. వారి ఆస్తుల వివరాలను చూస్తే.. పార్థసారథిరెడ్డి ఆస్తుల విలువ రూ.5300 కోట్లు కాగా, అయోధ్యరామిరెడ్డి ఆస్తుల విలువ రూ.2,577 కోట్ల మేర ఉంది.
బీఆర్ఎస్(BRS) పార్టీలోని 7 మంది ఆస్తి విలువ రూ.5,596 కోట్లతో అత్యధిక ఆస్తులు కలిగిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం ఎంపీ ఆస్తుల్లో మొదటి స్థానంలో ఉంది. అలాగే వైసీపీ పార్టీలోని 9 మంది ఎంపీల ఆస్తులు రూ.3,561 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రెండవ అత్యధిక స్థానంలో ఉంది. అలాగే భాజపాలోని మొత్తం 85 మంది ఆస్తుల విలువ రూ.2,579 కోట్లు. కాగా రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో, మహారాష్ట్ర నాల్గవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ లోని 30 మంది సభ్యులు రూ.1,549 కోట్లు కలిగి ఉన్నారు. ఆప్ సభ్యులు రూ.1,316 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు రూ.1,019 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.
అయితే పార్లమెంట్‌లోని మొత్తం 225 సభ్యుల ఆస్తుల విలువ రూ.18,210 కోట్లు ఉండగా అందులో వీరిద్దరి ఆస్తి 43.25 శాతంగా ఉందని అఫిడవిట్లను పరిశీలించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ADR) పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, వైసీపీ ఎంపీల ఆస్తి విలువను బట్టి చూస్తే వీరిదే 86.02 శాతంగా ఉంది. వీరి తరువాత బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ 1001 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
తాజాగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 233 మంది సభ్యుల్లో 225 మంది అఫిడవిట్లను పరిశీలించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) సంస్థ ఎంపీల ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పార్లమెంట్లో అత్యధిక సీట్లు ఉన్న బీజేపీ పార్టీ 85 మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 30 మందితో మొత్తం 115 మంది సభ్యుల ఆస్తి విలువ రూ.4,128 కోట్లు ఉంటే కేవలం బీఆర్ఎస్ లోని 7మంది, వైసీపీలోని 9మంది ఎంపీల ఆస్తి విలువ రూ.9,157 కోట్లు ఉందని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.
అయితే ఈ ఆస్తుల లెక్కలను నివేదిక బయటపెట్టిన తరువాత ప్రజల్లో, మేధావుల్లో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాసేవా చేస్తున్న వీరికి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని, ఎంపీ జీతాల, వారి బిల్లులు లెక్కచేసినా ఇంత సంపద కూడగట్టడం కష్టమేనని అంటున్నారు. వీరి ఆస్తుల వివరాలు బయటపెట్టిన ఏడీఆర్ సంస్థ మాదిరి అసులు వీరికి ఇంత ఆస్తులు ఎలా సమకూరాయి అనేదాన్ని కూడా మరేదైన సంస్థ బయట పెడితే ప్రజలకు ఉన్న అనుమానాలు తీరిపోతాయని ప్రజలు అభిప్రయపడుతున్నారు.