వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా మహ్మద్ ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Mohammed Iqbal: వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా మహ్మద్ ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశించి పార్టీలో ఉన్నారు.
ఇక ఇవ్వరని విషయం తెలుసుకున్న ఇక్బాల్ నాలుగు రోజుల క్రితం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లేఖను సీఎం జగన్‌కు, మండలి ఛైర్మన్‌కు పంపించారు. ఇక్బాల్‌కు టీడీపీలో ఏ పదవి అప్పగిస్తారనేది త్వరలో నిర్ణయం కానుంది. అయితే ఎన్నికల వేళ బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమిపై ముస్లింలలో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఇక్బాల్ టీడీపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.