»Supreme Court Supreme Court Angry With Baba Ramdev
Supreme Court: బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి కంపెనీ యాడ్స్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రాందేవ్, బాలకృష్ణ సమర్పించిన క్షమాపణలను కోర్టు తోసిపుచ్చింది.
Supreme Court: పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి కంపెనీ యాడ్స్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రాందేవ్, బాలకృష్ణ సమర్పించిన క్షమాపణలను కోర్టు తోసిపుచ్చింది. మేం గుడ్డివాళ్లం కాదని.. సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో కేంద్రం ఇచ్చిన వివరణ కూడా సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. పేపర్ మీద క్షమాపణలు చెప్పారు.. కానీ వాళ్లు వెన్ను చూపిస్తున్నారని, ఆ క్షమాపణలను అంగీకరించడం లేదని సుప్రీం తెలిపింది. కావాలనే ఉల్లంఘించినట్లు ఉందని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఏ అమానుల్లాతో కూడిన ధర్మాసనం తెలిపింది.
రాందేవ్, బాలకృష్ణలు మొదట తమ క్షమాపణ ప్రతాలు మీడియాకు పంపారని, సమస్య కోర్టుకు వచ్చేవరకు వాళ్లు తమకు అఫిడవిట్లను పంపలేదని తెలిపారు. రాత్రి క్షమాపణ పత్రాలను మీడియాకు పంపారని, కానీ తమకు అప్లోడ్ చేయలేదని, వాళ్లు కేవలం పబ్లిసిటీని నమ్ముకున్నారని జస్టిస్ కోహ్లీ తెలిపారు. అయితే క్షమాపణ పత్రాలు రిజిస్ట్రీకి అందాయా లేదా అనే విషయం తనకు తెలియదని పతంజలి కంపెనీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది తెలిపారు. అఫిడవిట్‌ను డీఫ్రాడ్ చేస్తున్నారని, ఎవరు ఆ డ్రాఫ్ట్‌ను రూపొందించారని, చాలా ఆశ్చర్యకరంగా ఉందని జస్టిస్ అమానుల్లా తెలిపారు. లోపం జరిగిందని సీనియర్ న్యాయవాది మాటలను సుప్రీం ధర్మాసనం వ్యతిరేకించింది.