»Women Lawyer Thugs Who Threatened A Woman Lawyer And Extorted Rs 10 Lakhs
Women Lawyer: మహిళా న్యాయవాదికి బెదిరించి రూ.10 లక్షలు దోపిడీ చేసిన దుండగులు
ఆన్లైన్ స్కామ్‌లు వల్ల సామాన్య ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బలి అవుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళా న్యాయవాది కూడా ఆన్లైన్ స్కామ్‌కి బలి అయ్యింది.
Women Lawyer: ఆన్లైన్ స్కామ్‌లు వల్ల సామాన్య ప్రజలే కాదు.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బలి అవుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళా న్యాయవాది కూడా ఆన్లైన్ స్కామ్‌కి బలి అయ్యింది. కస్టమ్స్ అధికారులమంటూ కొందరు కేటుగాళ్లు ఆ మహిళా న్యాయవాదిని బెదిరించి రూ.10 లక్షలు దోచుకున్నారు. నార్కోటిక్ టెస్టు పేరుతో వీడియో కాల్లో ఆమె దుస్తులు తొలగింపజేసి వీడియో రికార్డు చేశారు. ఆ వీడియోతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఏం చేయలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఏప్రిల్ 5న ముంభై శాఖ కస్టమ్స్ అధికారులమంటూ కొందరు వ్యక్తులు సదరు మహిళా న్యాయవాదికి వీడియో కాల్ చేశారు. ఆమె పేరుతో సింగపూర్ నుంచి ఓ డ్రగ్స్ ప్యాకేజీ వచ్చిందని బెదిరించారు. నార్కోటిక్స్ టెస్టు పేరుతో కాల్లో ఆమెతో దుస్తులు తొలగించి రికార్డు చేసి బెదిరించారు. అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె నగదును ఆన్లైన్లో బదిలీ చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.