Family Star day 5 box office collection : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ కలెక్షన్లు ఐదో రోజు అనూహ్యంగా పెరిగాయి. ఉగాది పర్వదినం సెలవు రోజు కావడంతో ఐదో రోజు కలెక్షన్లు ఊపందుకున్నాయి. నాలుగో రోజుకే చతికిల పడ్డట్టు కనిపించిన కలెక్షన్లు ఐదో రోజు పుంజుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. మంగళవారం పలు ధియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు సైతం కనిపించాయి.
ఫ్యామిలీ స్టార్ మూవీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్తోనే మొదలైంది. అయితే తర్వాత మిక్స్డ్ టాక్, నెగిటివ్ టాక్ ప్రభావాల వల్ల కలెక్షన్లు రోజు రోజుకూ తగ్గడం ప్రారంభం అయ్యాయి. తెలుగులో తొలి రోజు రూ.5.55 కోట్ల కలెక్షన్లతో ఫ్యామిలీ స్టార్ మొదలైంది. రెండో రోజు కలెక్షన్లు రూ.3.1 కోట్లు, మూడో రోజు రూ.2.75 కోట్లు, నాలుగో రోజు(day4) రూ.1.5 కోట్లు వసూలు చేసింది. తమిళంలోనూ ఈ సినిమా రిలీజైంది. అక్కడ నాలుగు రోజులు కలిపి కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే నాలుగో రోజుతో పోలిస్తే ఐదో రోజు కలెక్షన్లు రెంట్టింపు కావడం విశేషం.
ఫ్యామిలీ స్టార్(Family Star) మూవీ ఐదు రోజులు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.24.75 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలోనే నిలిచిపోయింది. గురువారం (ఏప్రిల్ 11) రంజాన్, ఆ తర్వాత సెకండ్ శాటర్ డే, సండే హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ ఫ్యామిలీ స్టార్ సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇండియాలో ఇప్పటి వరకూ తెలుగు, తమిళ వెర్షన్లు కలిపి ఈ సినిమా రూ. 16 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో మరో రూ.9 కోట్లు వచ్చాయి. అయినా బ్రేక్ ఈవెన్ కు ఇంకా చాలా దూరంలోనే ఉంది.