జగన్ ను తిట్టడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఏపీ మంత్రి రోజా అన్నారు. బుధవారం తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్షికోత్సవం లో మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ చేస్తోంది యువగళం కాదని, టిడిపికి సర్వమంగళం అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పడిపోతూ వస్తోందన్నారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. టిడిపి నేతలు ఎంత తిడితే జనగ్ కు అంత మైలేజ్ వస్తుందని అన్నారు. నారా లోకేష్ వార్డు మెంబర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు చాలా తక్కువ అని విమర్శించారు. ఒక చోట ఓడిపోయిన లోకేష్, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను చూసి వైసీపీ కార్యకర్తలు భయపడరని అన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ అక్కినేనిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై రోజూ ఫైర్ అయ్యారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఆయన ఊరుకుంటారా అని బాలయ్యను ప్రశ్నించారు. బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పని, ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో అలాగే అక్కినేని అభిమానులు కూడా ఫీల్ అవుతారని అన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదని, ఇది ఆయన పెద్దరికానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం మంత్రి రోజా బాలయ్యపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.