వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయన కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీంతో…. ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన వారం రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. అనంతరం అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నారు.
ఇదిలావుంటే, కొన్నాళ్ల కిందట కూడా.. అనూహ్యంగా నాని అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ హైదరాబాద్లోనే చికిత్స తీసుకున్నారు. అయితే, అప్పట్లో కారణాలు వెలుగు చూడలేదు. కొన్నాళ్ల చికిత్స అనంతరం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం నిలకడగానే ఉందని, కిడ్నీ ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు చెప్పడం గమనార్హం. ఇక, నియోజకవర్గంలో కొడాలి నాని అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని.. పూజలు చేస్తున్నారు.