బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి (Tirupati) దేవస్థానానికి వెళ్లిన ఆయన స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నడ్డాకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి (Srivari) శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయనతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Virraj), బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు, ఉమ్మడి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy), మరికొందరు బీజేపీ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని జీవీఎల్ నరసింహరావు(GVL Narasimha Rao)తో ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం జేపీ నడ్డా తిరుచానూరు(Tiruchanur)లో కార్యకర్తలతో భేటీ కానున్నారు. తిరిగి సాయంత్రం శ్రీకాళహస్తి(Srikalahasti)లోని భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. శ్రీ వెంటేశ్వరుడంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయన్నారు.దేశంలో శాంతి., సంపూర్ణ అభివృద్ది సాధించేలా భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్ధించానని తెలిపారు. ప్రజలంతా స్వామి వారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందేలా దీవించాలని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు
ఈరోజు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని @BJP4India జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారు, @BJP4Andhra రాష్ట్ర అధ్యక్షులు @somuveerraju గారు & బిజెపి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులతో కలిసి దర్శించుకోవడం జరిగింది.