»If You Write Govinda Namam Crore Times You Will Get A Free Vip Darshan To Tirumala Temple
Govinda namam: గోవిందా అని కోటి సార్లు రాస్తే..ఫ్రీగా తిరుమల వీఐపీ దర్శనం
రామకోటి మాదిరిగా గోవింద కోటి నామాలు(Govinda namam) రాసిన వారికి, వారి ఫ్యామిలీకి ఉచితంగా వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే అలా రాసిన పుస్తకం తమకు చూపించాలని లేదా పంపించాలని తెలిపారు.
If you write Govinda naam crore times you will get a free VIP darshan to Tirumala temple
‘రామకోటి’ తరహాలోనే ‘గోవింద కోటి’ నామాలు(Govinda namam) రాయడాన్ని టీటీడీ(TTD) ట్రస్ట్ బోర్డు ప్రోత్సహిస్తుందని ఈ బోర్డు చైర్మన్ బి. కరుణాకర్ రెడ్డి(bhumana karunakar reddy) అన్నారు. కోటి సార్లు గోవింద నామం వ్రాసిన 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉచితంగా వీఐపీ దర్శన సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలో 10,01,116 సార్లు గోవింద నామం రాయాలని తెలిపారు. పిల్లలలో నైతికతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత సారాంశంతో కూడిన కోటి బుక్లెట్లను ఎల్‌కెజి నుంచి పిజి వరకు ఉన్న విద్యార్థులకు ‘పుస్తక ప్రసాదం’గా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
దీంతోపాటు తిరుపతి(tirupati)లో భక్తుల వసతి సౌకర్యాలను పెంపొందించేందుకు రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గోవిందరాజ రెండు, మూడు సత్రాలను తొలగించి రూ.300 కోట్లతో రెండు అత్యాధునిక యాత్రికుల సముదాయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పాత భవనాలు దాదాపు 20,000 మంది యాత్రికులకు వసతి కల్పిస్తాయని అన్నారు. చిరుతపులి దాడిలో దుర్మరణం చెందిన ఆరేళ్ల లక్షిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. బాంద్రాలో రూ.1.65 కోట్లతో మరో శ్రీవారి ఆలయాన్ని, రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రాన్ని నిర్మించాలని టీటీడీ ప్లాన్ చేసింది. మొత్తం మొత్తాన్ని ట్రస్ట్ బోర్డు సభ్యులు విరాళంగా అందిస్తారు. టీటీడీ ఉద్యోగుల క్వార్టర్ల మరమ్మతులకు రూ.49.5 కోట్లు కేటాయించారు.
‘సనాతన ధర్మం’పై తమిళనాడు మంత్రి ఉదయనిధి(udhayanidhi) స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కరుణాకర్ రెడ్డి ప్రస్తావించారు. సనాతన ధర్మం ఒక మతం కాదు, జీవనశైలి. ఇది ఏ ఒక్క కులం లేదా వర్గానికి సంబంధించినది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తాయన్నారు. సనాతన ధర్మంపై ఇలాంటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యాఖ్యలు సరికాదని ఆయన హెచ్చరించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) సెప్టెంబర్ 18, 2023న జరిగే వార్షిక బ్రహ్మోత్సవంలో శ్రీవెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీంతోపాటు 2024కి సంబంధించిన TTD క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారు. TTD మరమ్మతులతోపాటు వివిధ కేటాయింపులు, గ్రాంట్లు ఇప్పటికే ఆమెదించారు. ఉద్యోగుల క్వార్టర్స్, మతపరమైన సిబ్బంది వంటి ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.