అన్నమయ్య: జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎటువంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. నేడు మదనపల్లె కలెక్టరేట్లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. జెసి మాట్లాడుతూ.. జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. వినియోగదారులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని అన్నారు.