BPT: లోక్ అదాలత్లో రాజీమార్గంలో ఎక్కువ కేసులు పరిష్కరించిన కర్లపాలెం ఎస్సై రవీంద్రను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్సై రవీంద్రకు ప్రశంసా పత్రాన్ని ఎస్పీ అందజేశారు. బాధితులు కోర్టులు చుట్టూ తిరగకుండా వారి సమయాన్ని వృధా చేయకుండా రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు.