ATP: RDT వ్యవస్థాపకుడు, మానవతావాది ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి సందర్భంగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేదల పెన్నిధిగా నిలిచిన ఫెర్రర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతపురం జిల్లా అభివృద్ధిలో, అణగారిన వర్గాల అభ్యున్నతిలో ఆయన చూపిన చొరవ ఎంతో గొప్పదని స్మరించుకున్నారు.