కోనసీమ: మండపేట రూరల్ ద్వారపూడి గ్రామంలో ఉన్న రైల్వేస్టేషన్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాలు కల్పించాలని బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఇవాళ మండపేటకు విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ కీర్తి చేకూరికు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్లో ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు లేవన్నారు.