ELR: కార్మికులంతా తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ సమావేశం కొయ్యలగూడెంలోని ఏఎంసీ యార్డులో జరిగింది. కార్మికుల హక్కుల కోసం పోరాడి 44 చట్టాలను సాధించుకుంటే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాటిని నీరుగార్చిందని ఆయన విమర్శించారు. కార్మిక చట్టాల పరిరక్షణకు పోరాటం అవసరమని ఆయన అన్నారు.