అన్నమయ్య: కలకడ మండలం బాలయగారిపల్లె జరికోనలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షమ్మ, సిద్దేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు తిప్పారెడ్డి, కమలాకర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు.