ATP: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన అక్కల రిష్వంత్ రాయ్ (రిషి), తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే పరిటాల సునీతను ఆహ్వానించారు. మార్చి 8వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి సకుటుంబంగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రిష్వంత్ రాయ్‌ను ఎమ్మెల్యే సునీత ప్రత్యేకంగా అభినందించారు.