SRPT: త్రిపురవరం-శ్రీరంగాపురం మార్గంలో మలుపు వద్ద భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నెలలుగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో రాత్రివేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రమాద భయం వెంటాడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.