ప్రకాశం: కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.