AKP: సమస్యల పరిష్కారానికి అధికారులు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 138, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమానికి 143 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.