మన్యం: జిల్లాలోని నీటి వనరులను శాశ్వత ప్రాతిపాదికన సంరక్షించేందుకు, భూగర్భ జలాల మట్టాలను పెంచేందుకు అత్యధిక సాకేంతికతో కూడిన మ్యాపింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ప్రధాన కార్యదర్శికి వివరించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం రీ సర్వే, జలధార తదితర అంశాలపై కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.