VZM: ప్రతిఒక్కరూ విధిగా తమ విధులు బాధ్యతలను తెలుసుకోవాలని గజపతినగరం జడ్జి ఏ.విజయ రాజ్ కుమార్ సూచించారు. శుక్రవారం స్దానిక బోడసింగిపేటలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలని చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.