VZM: మెరకముడదాం మండలం మర్రివలస శివారులో పేకాట ఆడుతున్నారన్న ముందస్తు సమాచారంతో మంగళవారం సాయంత్రం బుదరాయవలస SI లోకేశ్ కుమార్ దాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని, ఈ దాడులలో వీరితో పాటు రూ.740 నగదు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.