PLD: బక్రీద్ పండుగ వేళ గురజాలలో జంతు సంక్షేమ, ప్రజారోగ్య నియమాలను కఠినంగా అమలు చేస్తామని బుధవారం మున్సిపల్ కమిషనర్ శివన్నారాయణ తెలిపారు. అనుమతి లేని స్థలాల్లో మాంసం అమ్మడం చట్టవిరుద్ధమని, వ్యాపారులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలంతా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.