ELR: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు-సరిపల్లి గ్రామాల మధ్య హుకుంపేట చెరువు సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఏడు మోటార్ బైక్లు, మూడు కోడిపుంజులు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపారు.