NLR: సోమశిల జలాశయానికి శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 1,922 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 69.707 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 2,550 క్యూసెక్కులు, కండలేరుకు 550 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.