TG: ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ‘బీజేపీది గోబెల్స్ ప్రచారమే. కేసీఆర్ కుటుంబం చేసిన తప్పులకు జైలుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్కు ప్రజల మద్దతు లేదు. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం. దేశంలోనే తెలంగాణ.. మోడల్ రాష్ట్రంగా మారుతుంది’ అని పేర్కొన్నారు.