AP: గుంటూరు జిల్లా మేరికపూడి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచి వచ్చిన యాత్రికుల బస్సు గుంటూరు నుంచి శ్రీశైలం వైపు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొంతమందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.