విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయం అని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని AISF జిల్లా కార్యదర్శి యు. నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడంతో పాటు సొంత గనులు కేటాయించినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కేంద్ర ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.