అల్లూరి: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో విజయ కుమారి పిలుపునిచ్చారు. శనివారం కొయ్యూరు ఐసీడీఎస్ కార్యాలయంలో మండలంలోని అంగన్వాడీ సిబ్బందితో ప్రాజెక్ట్ మీటింగ్ నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అన్నారు.