EG: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ నారసింహుని ఆలయం ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.