ఐపీఎల్-2025 సీజన్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ టీంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఈ టీమ్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఉండగా ఇప్పుడు రిషభ్ పంత్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తమ టీమ్ కెప్టెన్ ఎవరన్న విషయం సోమవారం అధికారికంగా ప్రకటిస్తామని ఎల్ఎస్జీ తెలిపింది.