KMM: ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం పట్టిష్ట చర్యలు చేపట్టిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం పాకబండ వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సబ్ స్టేషన్లను నిర్మిస్తుందన్నారు.