అల్లూరి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 250 రోజుల పని దినాలు కల్పించాలని సీఐటీయూ ముంచంగిపుట్టు మండల కార్యదర్శి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఉపాధి హామీ పథకం కూలీలతో కలిసి వనుగుమ్మ గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.