తూ.గో: రాజమండ్రి శ్రీ సత్య సాయి గురుకులంలో ఈ నెల 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు గరికిపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఉండనుంది. సత్యసాయి బాబా వారి శత వసంతాల వేడుకల్లో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ ప్రవచనం ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.