KDP: స్వర్గీయ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి వేడుకలు సిద్ధవటం మండలంలో శనివారం ఘనంగా జరిగాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ 1982లో టీడీపీ పార్టీని స్థాపించిన తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని కొనియాడారు.