పల్నాడు: తెలుగు జాతి గురించి ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.