TPT: సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం టీపీ.కోటకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త మొండిలి సాహెబ్ శనివారం మృతిచెందారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు సంతాపం తెలిపారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు.