ప్రకాశం : ఒంగోలు ప్రకాశం భవనం ఆవరణలో ఏపీ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రాష్ట్ర మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ పాడు ఎమ్మెల్యే విజయకుమార్, మేయర్ సుజాత పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి దిక్సూచి లాంటివారన్నారు.